సౌరభాల 'సంపంగి' పత్రికావనానికి సుస్వాగతం!

సాహితీ వినీలాకాశంలో సరస్వతీ అమ్మవారు మరో పత్రిక రూపంలో వెన్నెలలు వెదజల్లే జాబిలిగా ప్రభవించింది ఈ యుగాది శుభదినాన. ఆ పత్రికే,  'సంపంగి'.  పత్రిక పెడదామని శ్రీవారు, వరప్రసాదరావు గారు నిర్ణయం తీసుకోగానే, పత్రికకు ఆ పేరు స్ఫురించటం అది సర్వజనామోదం పొందటం  వెంటవెంటనే జరిగిపోయాయి. అది నా ఆరాధ్యదేవత ఆ అమ్మవారి అనుగ్రహం కాక ఇంకేమిటి? 

చంపకము లేదా సంపంగి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఆవిడ అనుగ్రహంతో పుట్టిన ఈ పత్రికకు అంతకు మించిన పేరేం దొరుకుతుంది?

తుమ్మెద వాలని సంపంగి దేవతాపుష్పం! సాహిత్యంలో మకిలి అంటకుండా వచ్చే మన సంపంగి పత్రిక సరస్వతీ చరణారవింద సమర్పణం!

ఒక యజ్ఞంలా మొదలు పెట్టిన ఈ పత్రికకు నాతోపాటు శ్రీమతి నండూరిసుందరీ నాగమణి, శ్రీమతి గిరిజారాణి కలవల, శ్రీమతి లలిత గోవిందరాజు, శ్రీమతి దాసు శ్రీ హవిష, శ్రీ యష్ విహారి సహ ఋత్విక్కులు. ఫలితాన్నివ్వాల్సిన యజ్ఞ అధిదేవతలు మీరే - మానవరూపంలో ఉన్నారు! 

ఈ పత్రిక స్థాయిని దృష్టిలో పెట్టుకుని మంచి రచనలు, కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు రచించి పంపండి.
మీ రచనలు పంపవలసిన చిరునామా:
sampangipatrika@gmail.com

సరస్వతి కరవది

సభ్యత్వ ఆహ్వానము!

'సంపంగి'
అందరికోసం, అంతర్జాల మాసపత్రిక!

తెలుగు పఠనాభిరుచిని పెంపొందించేందుకు, కుటుంబ సభ్యులందరినీ అలరించేందుకు రూపొందించిన మా తెలుగు అంతర్జాల కుటుంబ మాసపత్రిక 'సంపంగి'.

ఆసక్తికరమైన సీరియల్ నవలలు, హృద్యమైన కుటుంబ కథలు, చిన్న కథలు, రకరకాల విషయాలపై వ్యాసాలు, ఇంకా... ఎన్నో, ఎన్నెన్నో శీర్షికలు !
ఎక్కడైనా – ఎప్పుడైనా చదవడానికి ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి, ఇక్కడే మీ వాట్సాప్ నంబర్‌తో నమోదు చేసుకోండి!