సంపంగి సారథుల పరిచయాలు

మా ‘సంపంగి’ బృందంలో అందరూ మీకు తెలిసినవారే! ముఖ్య సంపాదకురాలు సరస్వతి గారు, ఆరు నవలలు, అరవై కథలుగా ఎన్నో బహుమతులు గెలుచుకుంటూ, సాహితీరంగాన దూసుకుపోతున్న సవ్యసాచి. ప్రారంభ కథతోనే స్వాతి బహుమతితో శుభారంభం చేసిన ఆమె, పోయిన సంవత్సరం తన కథకు అనిల్ అవార్డు సాధించిన ధురీణ.

ఆమె కలానికి పదునెక్కువ. అవి కథలు కానీ, నవలలు కానీ, కవితలు కానీ, సమీక్షలు కానీ, వ్యాసాలు కానీ, పరిచయాలు కానీ... అన్ని ప్రక్రియలలో పేరొందిన ఆమె సంపాదకత్వంలోనూ సంపాదించిన అనుభవంతో ‘సంపంగి’ని విజయపథంలో నడిపిస్తుందనటంలో సందేహం లేదు.

ఇక ఉపసంపాదకులు శ్రీమతి కలవల గిరిజారాణి, శ్రీమతి నండూరి సుందరీ నాగమణి సాహిత్యరంగాన లబ్ధప్రతిష్ఠులు. క్రియేటివ్ టీమ్ సభ్యులైన శ్రీమతి గోవిందరాజు లలిత, శ్రీమతి దాసు శ్రీ హవిష గారలు సాహిత్యనేపథ్యం, సాంకేతికనైపుణ్యం గల విద్యాధికులు. టెక్నికల్ హెడ్ శ్రీ యష్ విహారి సాంకేతికరంగంలో ఓ నవ, యువతరంగం. వీరందరి సమిష్టికృషితో వెలువడనున్న సంపంగి మీ హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించుకుంటుందని మా నమ్మకం.